మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి తమ కార్యకర్తలు సహకరించాలని తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో గురువారం పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందని విమర్శించారు. ప్రజా సంక్షేమం కోరి కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యకర్తలకు తమను గెలిపించుకోవాలని దిశానిర్దేశం చేశారు.