పాలకుర్తిలో వైభవంగా వన భోజనాల కార్యక్రమం

జనగామ జిల్లా పాలకుర్తిలోని చాకలి ఐలమ్మ మార్కెట్ ప్రాంగణంలో ఆర్యవైశ్య మండల, పట్టణ, మహిళ, యువజన సంఘాల ఆధ్వర్యంలో వన భోజనాలను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని చేసిన ఈ కార్యక్రమంలో కళా ప్రదర్శనలు, కోలాటాలు, ఆటపాటలు ఆకట్టుకున్నాయి. కుటుంబ సమేతంగా వినోదాన్ని పంచుకున్నారు. సంఘం నేతలు తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్