అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర: భక్తుల కోలాహలం

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ గ్రామంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర భక్తిశ్రద్ధలతో జరుగుతోంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. భక్తుల సౌకర్యార్థం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఉత్సవ కమిటీ చైర్మన్ వంచ రంగారెడ్డి, సభ్యులు, కార్యనిర్వహణ అధికారి అద్దంకి నాగేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జాతరను శాంతియుతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్