ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో బుధవారం ఘన వ్యర్థాల నిర్వహణపై ఇంటింటా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ స్వప్న సంతోష్ కందికట్ల మాట్లాడుతూ, తడి, పొడి మరియు ప్రమాదకర వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి పంచాయతీ సిబ్బందికి అందించాలని కోరారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎం.డి. ఆస్మా, వార్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.