ఉమ్మడి వరంగల్ జిల్లా, పాలకుర్తిలోని రాయపర్తి మండలం గన్నరం గ్రామంలో మంగళవారం ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు డీజే బాక్సులను పంపిణీ చేశారు. ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు ఈ హామీని నెరవేర్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.