జనగామ జిల్లా కేజీబీవీ పాలకుర్తిలో శుక్రవారం దిక్సూచి కార్యక్రమంలో భాగంగా పిల్లల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ తెలిపారు. ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది విద్యార్థులకు పరీక్షలు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు.