గూడూరులో సర్పంచ్ అభ్యర్థిని ప్రకటించిన సీపీఎం

జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో సీపీఎం నేతలు సోమవారం సమావేశమయ్యారు. మండల కార్యదర్శి మాచర్ల సారయ్య మాట్లాడుతూ, గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని, అభ్యర్థి గెలుపు కోసం నేతలు నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మాచర్ల శాంతమ్మను సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సమావేశంలో గడ్డి సమ్మయ్య, మాసంపల్లి నాగయ్య, బెల్లి సంపత్, చెరుపల్లి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్