దేవరుప్పుల: 24 గంటల్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూరులో వృద్ధురాలి మెడలో 3 తులాల బంగారు గొలుసు చోరీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో నిందితుడిగా బాధితురాలి మనవడు కప్పెర అనిల్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. అతని నుంచి బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. కేసును ఇంత వేగంగా ఛేదించిన దేవరుప్పుల పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత పోస్ట్