కేశవపూర్ గ్రామంలో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో దూడలు, లేగలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుజే సుధాకర్ మాట్లాడుతూ రైతులు పశువుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, ఉచిత పశువైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశుసంపద సహాయకుడు దాసరి శంకర్ మాట్లాడుతూ 75 శాతం సబ్సిడీపై అందించే పశుగ్రాస విత్తనాలను రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పద్మ భూషణ్ స్వామి, వార్డు సభ్యుడు కృష్ణ, కారోబార్ దేవేందర్, రైతులు పాల్గొన్నారు.