ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ పై దేశద్రోహం కేసు పెట్టాలి

దేశంలో ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ఎన్నికల ప్రధాన అధికారి జానేష్ కుమార్ పై దేశద్రోహం కేసు నమోదు చేసి, తక్షణమే అరెస్టు చేయాలని సీపీఎం పార్టీ తొర్రూరు మండల కార్యదర్శి ఎండి యాకూబ్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని గాంధీ సెంటర్లో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా యాకూబ్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తొత్తుగా ఎన్నికల సంఘం మారిపోయిందని, దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా నుండి ప్రతిపక్ష పార్టీల ఓట్లను తొలగించడం ద్వారా అధికార బీజేపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ రాజ్యాంగ విరుద్ధానికి పాల్పడుతున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్

✕
✕