పాలకుర్తిలో ఇంధన కష్టాలు బంకుల వద్ద బారులు

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గత రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. సోమవారం ఒక బంకుకు డీజిల్ నిల్వలు చేరడంతో వాహనదారులు భారీగా తరలివచ్చారు. ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా సాగుతుండటంతో హార్వెస్టర్ల యజమానులు, రైతులు ఇంధనం కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. డీజిల్ దొరక్క వ్యవసాయ పనులు స్తంభించిపోతున్నాయని, అధికారులు తక్షణమే స్పందించి సరఫరా పెంచాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్