జనగామ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రామరాజుపల్లి గ్రామానికి చెందిన ఎలగందుల నరసింహ (45) అనే వ్యక్తి స్పాట్ లోనే మృతి చెందాడు. నరసింహ వృత్తిరీత్యా మేస్త్రిగా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం పనులు ముగించుకుని, సింగరాజుపల్లి వద్ద ఉన్న వివేర హోటల్లో భోజనం చేసిన అనంతరం రోడ్డు దాటుతున్న సమయంలో అతివేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్