కొడకండ్ల: త్రిపుల్ ఐటి బాసరకు 8 మంది విద్యార్థినులు ఎంపిక

జనగామ జిల్లా కొడకండ్ల మహిళ గురుకుల పాఠశాల నుంచి త్రిపుల్ ఐటి బాసరకు 8 మంది విద్యార్థినులు ఎంపికైనట్లు శుక్రవారం ప్రిన్సిపాల్ తమ్మి దిలీప్ కుమార్ తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన హారిక, మోక్షజ్ఞ, వైష్ణవి, ఇందు, కార్తీక, శ్రీజ, నాగేశ్వరి, వేదన సీటు సాధించినట్లు చెప్పారు. ఈ విజయానికి సహకరించిన ఉపాధ్యాయ బృందంతో పాటు తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్