కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలి

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చూపిన ధైర్య సాహసాలు త్యాగాలు నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి టిఏవి నాగలక్ష్మి అన్నారు. జిల్లా కలెక్టర్ అనుమతితో జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ హాలులో జిల్లా రెవెన్యు అధికారి టి ఏ వి నాగలక్ష్మి కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రతి ఒక్కరూ వారి ఆశయాలను కొనసాగించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕