పాలకుర్తిలో వైభవంగా లక్ష్మీనరసింహ స్వామి జయంతి వేడుకలు

జనగామ జిల్లా పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గురువారం నరసింహ స్వామి జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ ప్రత్యేక సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం, నూతన వస్త్రాలంకారం, పుష్పాలంకారం, సహస్రనామార్చన, అష్టోత్తర శతనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆశీర్వాదం పొంది, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్