పాలకుర్తిలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మహా గణపతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గణేష్ భక్తులు పాల్గొన్నారు.