ఇద్దరు పిల్లలకు ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ శివారులోని అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావలి, కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురై, తన ఇద్దరు కొడుకులను ఉరివేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం స్థానికంగా కలకలం రేపింది. వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న కాలీఫ్లవర్ పొలంలోని వేప చెట్టుకు ముగ్గురు ఉరివేసుకున్నట్లు గుర్తించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్