డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చోరీ జరిగినట్లు ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడు జనార్ధన చారి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో దుండగులు చొరబడి 8, 9, 10వ తరగతి గది తాళాలు పగలగొట్టి స్విచ్ బోర్డులు ధ్వంసం చేశారని, ఫ్యాన్లను ఎత్తుకెళ్లారని తెలిపారు. పాఠశాలకు వచ్చి చూసేసరికి చోరీ జరిగినట్లు గుర్తించామన్నారు.