పాలకుర్తి మండలంలోని సోమనాధ కవి స్మృతి వనాన్ని బీఆర్ఎస్ శ్రేణులు పరిశీలించారు. ఇది అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని విమర్శిస్తూ, గురువారం శుభ్రం చేసి విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీసుకొచ్చిన రూ. 5 కోట్లతో టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలన్నారు.