పాలకుర్తి: వేసవిలో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు

జనగామ జిల్లా పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఆధ్వర్యంలో చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. వేసవిలో దర్శనానంతరం భక్తులు సేదతీరేందుకు ఈ ఏర్పాట్లు చేశారు. భక్తులు దాహార్తిని తీర్చుకుంటూ, చలువ పందిళ్ల నీడన సేదతీరుతున్నారు. అయితే, చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్