జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో శనివారం రాత్రి పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై దూలం పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో, వారి నుంచి రూ. 16 వేలు నగదు, 4 సెల్ ఫోన్లు, 4 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.