పాలకుర్తి మండలంలో ఉన్న ఆదికవి పాల్కురికి సోమనాథుడు స్మృతివనం పూర్తిగా నిర్లక్ష్యం చెంది అధ్వానంగా మారిందని బీజేపీ మండల అధ్యక్షుడు మారం రవికుమార్ విమర్శించారు. రూ.80 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేసి ప్రభుత్వ వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. శనివారం బీజేపీ నేతలు స్మృతివనాన్ని సందర్శించి పరిశీలించారు.