మిస్సింగ్ ఫోన్‌ను సీఈఐఆర్ ద్వారా గుర్తించిన పోలీసులు

రాయపర్తి పోలీసుల చొరవతో మిస్సింగ్ అయిన మొబైల్ ఫోన్‌ను సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా గుర్తించి బాధితుడికి తిరిగి అందజేశారు. రాయపర్తి ఎస్‌ఐ ముత్యం రాజేందర్‌ ఆధ్వర్యంలో సీఈఐఆర్‌ పోర్టల్‌ సహాయంతో ఫోన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మిస్సింగ్‌ ఫోన్‌ యజమాని బానోతు తార్యకు ఎస్‌ఐ ముత్యం రాజేందర్‌ ఫోన్‌ను అప్పగించారు. ఫోన్‌ను తిరిగి పొందడంతో బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕