ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంచర్ల వెంకటాచారి డిమాండ్ చేశారు. మంగళవారం జేఏసీ పిలుపులో భాగంగా పి అర్ సి, 6 డిీఏ లు, b పెండింగ్ బిల్లులు, హెల్త్ కార్డుల అమలు సమస్యలను పరిష్కరించాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ తొర్రూరు అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో తొర్రూరు పట్టణ కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకటాచారి మాట్లాడుతూ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనియెడల జేఏసీ పిలుపుమేరకు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.