రాయపర్తి మండలం ఊకల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల సోమయ్య, పోలేపక ఎల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబాలను పరామర్శిస్తూ, ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబానికి 3000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ కుందూరు రామచంద్ర రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పూస మధు తదితరులు పాల్గొన్నారు.