జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మినారాయనపురం గ్రామంలో మెంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి పంటలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బిఆర్ఎస్ శ్రేణులు పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న నష్టాలను అంచనా వేసి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు. తుఫాన్ ప్రభావం వల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.