కాట్రపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అల్పాహార పథకాన్ని గ్రామ సర్పంచ్ రాపాక పద్మ బ్రహ్మచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజూ ఉదయం 8: 30 గంటలకు పాఠశాలకు హాజరై ప్రభుత్వం అందించే అల్పాహారాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఝాన్సీ, కుమారస్వామి, ఉపాధ్యాయులు వెంకటరమణ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.