సోమేశ్వరుడికి రూ. 18. 04 లక్షల ఆదాయం

జనగామ జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయ హుండీ ఆదాయం 85 రోజులకు రూ. 18,04,055 సమకూరినట్లు ఈఓ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. శుక్రవారం ఆలయ కల్యాణ మండపంలో కొడవటూరు ఈఓ చిందం వంశీ పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరిగింది. గతేడాది అక్టోబరు 9 నుంచి ఈ ఏడాది జనవరి 1 వరకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా, నగదుతో పాటు 88 డాలర్ల అమెరికా కరెన్సీ (13 నోట్లు) కూడా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్