జనగామ జిల్లా పాలకుర్తిలో గురువారం ఉదయం విభిన్న వాతావరణం నెలకొంది. ఒకవైపు 40 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా, అకస్మాత్తుగా పొగమంచు పట్టణాన్ని కప్పేసింది. ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. పొగమంచు కారణంగా వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నడకకు వెళ్లేవారు ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆనందిస్తున్నారు.