తొర్రూరు: పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేయాలని ఆందోళన

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట మహిళలు నిరసన తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలకు పాల్పడ్డ గ్రామ పంచాయతీ సెక్రటరీ పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు.

సంబంధిత పోస్ట్