మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో సోమవారం మొక్కజొన్న రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయ మార్కెట్ ముందు జరిగిన ఈ నిరసనలో, మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభమై 25 రోజులు గడుస్తున్నా ఇంకా కొనుగోళ్లు జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో ఆరబోసిన మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.