తొర్రూరు: శివాలయ పునఃప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న ఝాన్సీరెడ్డి

పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించిన శివాలయం పునఃప్రతిష్టాపన మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పునః ప్రతిష్టాపన కార్యక్రమం సంప్రదాయబద్ధంగా ప్రారంభమైంది. ఆలయ పరిసర ప్రాంతం అందంగా అలంకరించబడింది. శివపార్వతుల విగ్రహాలకు అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహించబడ్డాయి.

సంబంధిత పోస్ట్