తొర్రూరు: పెద్ద చెరువులో యథేచ్చగా మట్టి తవ్వకాలు

మహబుబాబాద్ జిల్లా తొర్రూరు పెద్ద చెరువు వద్ద మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే కాంట్రాక్టు దక్కించుకున్న కాంట్రాక్టర్ చంద్రయ్య ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద చెరువులో యథేచ్చగా మట్టి తవ్వకాలు జరుపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని శనివారం స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడట్లేదని మండిపడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్