తొర్రూరు మండలంలో గురువారం జరిగిన టీఎస్‌యుటిఎఫ్ మెంబర్షిప్ క్యాంపెయిన్‌లో జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ మాట్లాడుతూ, ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించడంతో పాటు, కొత్త పీఆర్‌సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. 317 సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.