ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరు పట్టణ కేంద్రంలో గాంధీ సర్కిల్లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి శుక్రవారం పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తొర్రూరు లైన్స్ క్లబ్ పూర్వ అధ్యక్షులు, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సుర్ణపు రాంనర్సయ్య, చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ సుంకరనేని నాగవాణి మాట్లాడుతూ భారత జాతిపిత మహాత్మా గాంధీ లాగా అహింస, శాంతి మార్గాన్ని ఎంచుకొని, ప్రతి ఒక్కరూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు లైన్స్ క్లబ్ పూర్వ కార్యదర్శి ముడుపు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.