జనగాం జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామంలో కల్లుగీత కార్మిక సంఘం నాయకులు గూడ రవీందర్ భార్య జయలక్ష్మి మృతి చెందినందున వారి కుటుంబానికి అండగా ఉంటామని జిల్లా కల్లుగీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బాల్నే వెంకట మల్లయ్య అన్నారు. బుధవారం సభ్యులు రమేష్, నాగన్న, మహేందర్, వెంకటేష్, కొండయ్య, మహేష్, వెంకటయ్య, సారయ్య, యాదగిరి, వెంకటేష్ లతో కల్సి రవీందర్ కుటుంబాన్ని పరామర్శించారు.