మార్కెట్ యార్డు లో తడిసిన ధాన్యం

జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో మంగళవారం కురిసిన మోస్తరు వర్షం కారణంగా చాకలి ఐలమ్మ మార్కెట్ యార్డులో సగానికి పైగా కాంటా కాని ధాన్యం తడిసిపోయింది. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు.

సంబంధిత పోస్ట్