తొర్రూరు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మచ్చ సురేష్, బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తొర్రూరులో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ సెల్ (ఈ డి సి) ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకుని, నిరుద్యోగ యువతకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. తామే నలుగురికి పనులు కల్పించేలా స్వయం ఉపాధిని ఎంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బొలగాని రాములు అధ్యక్షత వహించారు.