పరకాల : అక్రమ తవ్వకాలలో మాయమవుతున్న కాకతీయుల కోట గుట్టలు

గీసుకొండ మండలంలోని వంచనగిరి నుండి కోటవెంకటపురం వెళ్లే మార్గంలో మొరం అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కొందరు అక్రమార్కులు ప్రకృతి వనరులను కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్నారు. కాకతీయ కట్టలను మాయం చేస్తూ మొరం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో మొరం వ్యాపారులు నిబంధనలను గాలికి వదిలేసి లక్షల రూపాయలు దండుకుంటున్నారు. కండ్ల ముందే అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు కట్టడి చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండల కేంద్రంలోని వంచనగిరిలో పెద్ద ఎత్తున మొరం తరలిస్తుండడంతో కోటకట్టలు కనుమరుగవుతున్నాయి.

సంబంధిత పోస్ట్