25 % సీట్లను బలహీనవర్గాల పిల్లలకు కేటాయించాలి

నిరుపేద విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడంలో ప్రైవేట్ పాఠశాలలకు ఎటువంటి మినహాయింపులు ఉండవని, ప్రభుత్వం కేటాయించిన విద్యార్థులను తక్షణమే చేర్చుకోవాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వరంగల్ కు చెందిన తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నాయకుడు హకీమ్ నవీద్ మాట్లాడుతూ, విద్యా హక్కు చట్టం, 2009లోని సెక్షన్ 12 ప్రకారం, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు తమ తరగతి సామర్థ్యంలో 25% సీట్లను సమాజంలోని వెనుకబడిన, బలహీనవర్గాల పిల్లలకు కేటాయించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ ఆదేశాలు ప్రైవేట్ పాఠశాలలకు వర్తిస్తాయని న్యాయస్థానం స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్