వరంగల్: రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న కారు... అక్కడికక్కడే మృతి

వరంగల్ ధర్మారం బస్టాండ్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ట్రాక్టర్ డ్రైవర్ ని కారు ఢీకొనడంతో నక్కలపల్లికి చెందిన పసునూరి కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ లో ఇటుక లోడు వేసుకొని నర్సంపేట వెళ్తుండగా ధర్మారం వద్ద చాయ్ తాగడానికి ఆగి రోడ్డు దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్