గీసుకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎస్సెస్సీ 1991-1992 బ్యాచ్ కు చెందిన షేక్ అంకూస్ పాషా అనే నిరుపేద వ్యక్తి ఇటీవల హైదరాబాదులోని నిమ్స్ హాస్పటల్ లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతని బాల్యస్నేహితులు మానవత్వంతో స్పందించి రూ25,000/-ల ఆర్థిక సహాయాన్ని అందజేసి, స్నేహ ధర్మం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో అతని బాల్య స్నేహితులు అందరూ పాల్గొన్నారు.