లారీని ఢీకొట్టిన ఆటో.. ముగ్గురికి గాయాలు

సంగెం మండలం తీగరాజుపల్లి ఫోటో తండాకు చెందిన బానోతు హనుమ, వాసం కృష్ణ, జాటోత్ రవి వరంగల్ కూరగాయల మార్కెట్ నుండి ఆటోలో తిరిగి వస్తుండగా, ఓంకార్ గార్డెన్ సమీపంలో రోడ్డుపై నిలిపిన లారీని ఢీకొన్నారు. లారీ డ్రైవర్ జాగ్రత్తలు తీసుకోకుండా వాహనాన్ని నిలిపివేయడమే ప్రమాదానికి కారణమని తెలిపారు. గాయపడిన ముగ్గురిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్