భూభారతి చట్టం ప్రణాళిక బద్ధంగా గ్రామ సభల ద్వారా అవగాహన కల్పించే కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో చేపట్టాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో పరకాల ఎమ్మెల్యే, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ సత్య శారద, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై చర్చించారు. భూభారతి చట్టం ప్రణాళిక బద్ధంగా ప్రజల్లో గ్రామ సభల ద్వారా అవగాహన కల్పించాలన్నారు.