గుడుంబా నిర్ములన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గీసుకొండ మండలం ఎలుకుర్తి, జాన్ పాక, మనుగొండ లకు చెందిన ఐదుగురు వ్యక్తులు గుడుంబా అమ్ముతూ పట్టుబడి గీసుకొండ తాహశీల్దార్ ముందు బైండ్ ఓవర్ కావడం జరిగింది. మళ్ళీ గుడుంబా అమ్ముతూ పట్టుబడి నందున తాహశీల్దార్ రిమాండ్ విధించగా వారిని నర్సంపేట మహిళా జైలుకి శుక్రవారం సాయంత్రం అప్పగించారు. ఇందులో ఎస్సై జ్యోతి, సిబ్బంది పాల్గొన్నారు.