పరకాల మున్సిపాలిటీ 19వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల్లో పరకాలలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని, టిఆర్ఎస్, బిజెపి నాయకులు అభివృద్ధి కోసం కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలిపారు.