గీసుకొండ మండలానికి చెందిన దాడి శివను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియమించారు. ఈ నియామకాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో గీసుకొండ మండలంలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున దాడి శివకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి ఆయన నాయకత్వం కీలకమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.