పరకాల దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని కంఠాత్మకూర్ సమ్మక్క – సారలమ్మ జాతరలో హసన్ పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన బండారి కిరణ్ కుమార్తె రష్మిక (2) తప్పిపోయింది. దామెర పోలీసులు బాలికను గుర్తించి, తల్లిదండ్రులకు సమాచారం అందించి క్షేమంగా అప్పగించారు. తమ పాపను సురక్షితంగా అప్పగించినందుకు తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.