గీసుగోండ మండలం కొనయమాకుల క్రాస్ రోడ్ వద్ద గల పి ఎస్ ఆర్ గార్డెన్ యందు కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో భూములు కోల్పోయిన సంగెం, గీసుగోండ మండలాల పరిధిలోని రైతులకు రాజీవ్ కాలనీలో నిర్మిస్తున్న ఇండ్లకు ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారద, చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి తో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు రుణపడి ఉంటామని అన్నారు.