గూడూరి చైతన్యకు డాక్టరేట్ ప్రధానం

హనుమకొండ జిల్లా పరకాల పట్టణానికి చెందిన గూడూరి చైతన్య “భారతీయ మరియు పాశ్చాత్య సాహిత్య విమర్శలు” అనే అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఉన్న కేఎల్ యూనివర్సిటీ వారు డాక్టరేట్‌ను ప్రకటించారు. గూడూరి చైతన్య ఆంగ్ల విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజా అంబేద్కర్ పర్యవేక్షణలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. గూడూరి చైతన్యకి డాక్టరేట్ రావడం పట్ల కుటుంబ సభ్యులు, తోటి ఉపాధ్యాయులు, స్నేహితులు, అలాగే ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ కె. జగన్మోహన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్